: తొలి సవాల్‌కు దీటుగా జవాబిచ్చాం: టీమిండియా ఘోర పరాభవంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్
పూణే వేదికగా భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ర్యాంక్ టర్నర్ పిచ్ తయారు చేయాలన్న భారత్ ప్రయత్నం బెడిసికొట్టిందని వ్యాఖ్యానించాడు. కోహ్లీ అండ్ కంపెనీ మ్యాచ్‌ను తమ చేతుల్లో పెట్టిందని అన్నాడు. ఈ విజయం చిరస్మరణీయమని పేర్కొన్నాడు. 4,502 రోజులుగా తమకిక్కడ విజయం లేదని, టీమ్ మేట్స్ ఇక్కడ ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఆత్రుతలో ఉన్నారని తెలిపాడు. తొలి సవాల్‌కు దీటుగా జవాబిచ్చామని పేర్కొన్నాడు.