: జియో యాప్‌లో ఆ సేవ‌ల‌ను మేము ప్రారంభించ‌డం లేదు: స‌్ప‌ష్టం చేసిన రిల‌య‌న్స్


ఉచిత మంత్రంతో మార్కెట్లోకి దూసుకొచ్చి 170 రోజుల్లోనే 100 మిలియన్ల వినియోగదారులను సొంతం చేసుకున్న రిలయ‌న్స్ జియోలో మ‌రో సౌక‌ర్యం రాబోతోంద‌ని, యాప్‌ ఆధారిత ట్యాక్సీ సేవలను కూడా ప్రారంభిస్తుందని ఇటీవల ప‌లు వార్తలు వ‌చ్చాయి. ‘కిక్‌స్టార్ట్‌’ పేరుతో జియో వీటిని ప్రారంభిస్తుందని, ఆ రంగంలోనూ అడుగు పెడుతుంద‌ని అనుకున్నారు. అయితే, ఈ అంశంపై స్పందించిన రిల‌య‌న్స్ ప్ర‌తినిధులు తాము యాప్‌ ఆధారిత ట్యాక్సీ సేవలను ప్రారంభించటం లేదని స్పష్టం చేశారు. ‘ఆ వార్త తప్పు. ఖండిస్తున్నాం’ అని ఓ రిల‌య‌న్స్ ప్ర‌తినిధి త‌న‌ ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. త‌మ వ‌ద్ద‌ అలాంటి ప్రణాళికలు ఏవీ లేవని స్ప‌ష్టం చేశారు.

  • Loading...

More Telugu News