: సూపర్ స్టార్ సినిమా చూడనున్న రాష్ట్రపతి ప్రణబ్


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో... తాప్సీ, ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్ లు ఇతర పాత్రల్లో నటించిన సినిమా 'పింక్'. విమర్శకుల ప్రశంసలను సైతం ఈ సినిమా అందుకుంది. భారీ కలెక్షన్లను సాధించింది. పలు అంతర్జాతీయ వేదికలపైనే కాకుండా, ఐక్యరాజ్యసమితిలో సైతం ఈ సినిమాను ప్రదర్శించారు. ఆధునిక మహిళపై జరుగుతున్న అత్యాచారాలు, వారిపై చూపుతున్న వివక్ష ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇప్పుడు ఈ సినిమాను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీక్షించనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. చిత్ర బృందంతో కలిసి ఈ సినిమాను ప్రణబ్ చూడబోతున్నట్టు అమితాబ్ తెలిపారు. ఈ సందర్భంగా తాప్సి మాట్లాడుతూ, తాను నటించిన సినిమాను రాష్ట్రపతి చూడనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News