: రూ. 30 వేలు దాటిన బంగారం ధర


బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండటం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పుత్తడి ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 30,175కి చేరుకుంది. గత అక్టోబర్ తర్వాత బంగారం ధర రూ. 30 వేలను దాటడం ఇదే తొలిసారి. అలాగే వెండి కూడా కిలోకు రూ. 600కి పైగా పెరిగి రూ. 43,000లకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

  • Loading...

More Telugu News