: సెట్లో సెల్ఫీ తీసిందట.. యాంకర్ సుమను బంధించిన రాజమౌళి!
రామోజీ ఫిల్మ్ సిటీలో దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి-2' సినిమా షూటింగ్ ప్రత్యేక సెట్లో జరుగుతోంది. శుక్రవారం నాడు ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన యాంకర్ సుమ... ఓ సెల్ఫీ తీసుకుంది. అయితే, ఏ ఒక్కరు సెల్ఫీ తీసుకోకూడదని... ఒక్క ఫొటో కూడా బయటకు వెళ్లకూడదనేది రాజమౌళి ఆర్డర్ అట. దీంతో, ఆమెను వెంటనే దేవసేన కోసం తయారు చేసిన జైల్లో పెట్టారు.
ఆ తర్వాత తనను విడిపించమంటూ సుమ మొరపెట్టుకున్నా ఎవరూ రాలేదు. ఆ సమయంలో రాజమౌళే అక్కడకు వచ్చాడు. దీంతో, ఆమె బయటకు వచ్చి రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది. అయితే సుమకు రాజమౌళి ఒక కండిషన్ పెట్టాడు. సినిమా ఆడియో ఫంక్షన్ కు డబ్బులు తీసుకోకుండా హోస్ట్ చేస్తేనే జైలు నుంచి బయటకు తీసుకొస్తానని షరతు విధించాడు. దానికి సుమ ఓకే చెప్పడంతో, ఆమెను బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత రాజమౌళిని సుమ ఇంటర్వ్యూ చేసింది.
అయితే, ఇదంతా నిజంగానే జరిగింది అనుకునేరు. ఇదంతా, కేవలం సినిమా ప్రమోషన్ లో భాగంగా వెరైటీగా ప్లాన్ చేసిన ప్రోగ్రాం. రాజమౌళి ఈ విధంగా ప్లాన్ చేశాడు.