: ఇంగ్లిష్ మాట్లాడడం రాకపోవడం వల్లే కంగనా కాకమ్మ కధలు చెబుతోందట!


బాలీవుడ్ సినిమాల ముందు హాలీవుడ్ సినిమాలు దిగదుడుపే అంటోంది బాలీవుడ్ భామ కంగనా రనౌత్. అందుకే, తాను హాలీవుడ్ అవకాశాల కోసం వెంపర్లాడనని చెబుతుంది. అంతేకాదు, ఈ మధ్య 'రంగూన్' ప్రమోషన్ లో మాట్లాడుతూ, హాలీవుడ్ లో మంచి సినిమాలు రావడం లేదని, అసలు అంతకంటే గొప్ప సినిమాలు భారతీయ సినీ పరిశ్రమలోనే ఉన్నాయని తెలిపింది. తనకు హాలీవుడ్ లో నటించాలన్న కోరిక లేదని కూడా తేల్చిచెప్పింది.

దీనిపై బాలీవుడ్ లో జోకులు పేలుతున్నాయి. కంగనాకు ఇంగ్లిష్ రాకపోవడం వల్లే అలా మాట్లాడుతోందని అంటున్నారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కంగనాకు ఆంగ్ల ప్రావీణ్యం లేదు. నేర్చుకుందామని పలుమార్లు ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె హాలీవుడ్ ను తక్కువ చేసి మాట్లాడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుంది కగనా తీరు అంటూ విమర్శిస్తున్నారు, బాలీవుడ్ లో సత్తా చాటి హాలీవుడ్ లో కాలుమోపిన బాలీవుడ్ భామలు.

  • Loading...

More Telugu News