: గంగూలీ రికార్డును బద్దలు కొట్టిన ఏబీ డీవిలియర్స్
దక్షిణాఫ్రికా డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నారు. వన్డే క్రికెట్లో అతి తక్కువ మ్యాచ్ లు, ఇన్నింగ్స్ లలో 9000 పరుగుల మైలు రాయిని దాటిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. మొత్తం 205 ఇన్నింగ్స్ లలో ఏబీ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటి దాకా ఈ రికార్డు కోల్ కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. 228 ఇన్నింగ్స్ లలో గంగూలీ 9000 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా మూడో వన్డేలో డీవిలియర్స్ ఈ రికార్డును నెలకొల్పాడు.
గంగూలీ రికార్డును అధిగమించిన డీవిలియర్స్... రాహుల్ ద్రావిడ్ రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయాడు. వన్డేలు ఆడటం ప్రారంభించిన తర్వాత 9 ఏళ్ల 322 రోజుల్లో ద్రావిడ్ 9000 పరుగులను సాధించాడు. కానీ, డీవిలియర్స్ కు ఈ ఫీట్ సాధించడానికి 12 ఏళ్ల 23 రోజులు పట్టింది.