: సిరియాలో పంజా విసిరిన ఐఎస్ఐఎస్ ఆత్మాహుతి సభ్యుడు!


సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఇటీవలే ఇరాక్ సైనికాధికారుల పీకలు తెగ్గోసి ఐసిస్ మరోసారి కలకలం రేపిన సంగతి విదితమే. తాజాగా సుసియాన్ లోని రెబల్‌ కమాండ్‌ సెంటర్‌ వద్ద పేలుడు పదార్థాలు నింపి ఉన్న వాహనాన్ని ఐఎస్ఐఎస్ కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చేసినట్లు సిరియాలోని మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారని, మృతుల్లో అత్యధికులు స్థానిక పౌరులేనని మానవహక్కుల సంస్థ వెల్లడించింది.

కాగా, టర్కీ సరిహద్దుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ బాబ్ పట్టణంలో ఐఎస్ఐఎస్ కు మంచి పట్టు ఉండేది. ఇటీవలే అల్ బాబ్ పట్టణంపై సిరియా ప్రభుత్వ బలగాలు ఐఎస్ఐఎస్ పై వరుస దాడులు చేసి, పట్టణాన్ని హస్తగతం చేసుకున్నాయి. దీనికి ప్రతీకారంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుసియాన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో ఘటనలో తనిఖీలు నిర్వహిస్తున్న ఇద్దరు టర్కీ సైనికులను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హతమార్చినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News