: బాలయ్య 101వ సినిమాను ప్రకటించిన పూరీ జగన్నాథ్!
టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ 101వ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తికి తెరదించుతూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ట్విట్టర్ లో ప్రకటన చేశాడు. బాలకృష్ణ 101వ సినిమాను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపాడు. భవ్య క్రియేషన్స్ ప్రతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిపాడు. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మార్చి 9న ప్రారంభిస్తామని తెలిపాడు. సెప్టెంబర్ 29న ఈ సినిమాను విడుదల చేయనున్నామని పూరీ జగన్నాథ్ వెల్లడించాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి రేగుతోంది.