: ట్రాక్స్ మీద మహిళ.. అదే ట్రాక్స్ పైకి వేగంగా వచ్చిన ట్రైన్.. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో విచిత్రం!


ఢిల్లీ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకున్న ఘటనతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులంతా బిక్కచచ్చిపోయారు. ఏం జరుగబోతోందా? అని ఆసక్తిగా చూశారు. ట్రైన్ వెళ్లిపోవడంతో హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే, ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఫుట్ బ్రిడ్జ్ ఎక్కడాన్ని ఇబ్బందిగా భావించిన మహిళ ఒకరు ట్రాక్ పై నుంచి నడుచుకుంటూ వెళ్లేందుకు ట్రాక్ లోకి దిగింది. ఇంతలో ఎవరూ వూహించని విధంగా ఆమె నిల్చున్న ట్రాక్ మీదకి గూడ్స్ ట్రైన్ వచ్చేసింది. ఆ స్టేషన్ లో సిగ్నల్ లేకపోవడానికి తోడు, అది మధ్య ట్రాక్ కావడంతో దాని డ్రైవర్ నేరుగా పోనిచ్చాడు.

ఇంతలో ఆ మహిళ రైలు పట్టాల మధ్యలో కాళ్లు ముడుచుకుని పడుకుండిపోయింది. సహజంగా ఆమె పడుకున్న విధానానికి పెను ప్రమాదం జరిగేదే! కానీ విచిత్రంగా ఆమెకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. 42 బోగీల గూడ్సు రైలు వెళ్లిపోగానే ఆమె మెల్లగా లేచింది. వెంటనే ఫ్లాట్ ఫాం మీద ఉన్నవారు ఆమెకు చేయందించి సహాయం చేశారు. దీంతో ప్రయాణికులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఆ వీడియో మీరుకూడా చూడండి.

  • Loading...

More Telugu News