: ఇంకా తెలియని భావన వీడియోల ఆచూకీ!
ప్రముఖ సినీ నటి భావన లైంగిక వేధింపుల వీడియోల కోసం పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన 'ఖతర్నాక్' సినిమాలో విలన్ గా నటించిన లాల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమాలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా యూనిట్ ఏర్పాటు చేసిన కారులో వెళ్తుండగా, ఇప్పటి కారు డ్రైవర్, గతంలో డ్రైవర్ గా కొనసాగిన పల్సర్ సుని మరికొందరితో కలిసి ప్లాన్ చేసి, ఆమెపై లైంగిక వేధింపులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులకు వారు తీసిన వీడియోల సమాచారం అందలేదు.
ఘటన జరిగిన నాలుగురోజులు నిందితులు పోలీసులకు పట్టుబడకుండా దాక్కున్నారు. వారికి సినీ పరిశ్రమలోని వారే ఆశ్రయం కల్పించడంతో ఈ ఘటన వెనుక మలయాళ సినీ కుటుంబం ఉందన్న అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు రాజకీయనాయకుల కుమారులకు కూడా ఈ ఘటనలో ప్రమేయముందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ వీడియోల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. హీరోయిన్ ను రెండున్నర గంటలపాటు కారులో తిప్పుతూ వేధింపులకు దిగిన ప్రాంతాలకు తీసుకెళ్లి దర్యాప్తు జరుపుతున్నారు.