: భారత టెస్ట్ క్రికెట్ లోనే అత్యంత చెత్త రికార్డు ఇది!


ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతున్న టీమిండియా... ఈ రోజు అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో  చివరి 7 వికెట్లను కేవలం 11 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఇది భారత టెస్ట్ క్రికెట్ లోనే అత్యంత చెత్త రికార్డుగా నమోదైంది. 1989-90లో చివరి ఏడు వికెట్లను 18 పరుగుల వ్యవధిలో ఇండియా కోల్పోయింది. ఇది జరిగిన 27 ఏళ్ల తర్వాత ఆ రికార్డును మళ్లీ అధిగమించింది. ఈ రోజు ఆటలో 94 పరుగుల వద్ద నాలుగో వికెట్ ను ఇండియా కోల్పోయింది. ఆ తర్వాత మరో 11 పరుగుల వ్యవధిలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. 

  • Loading...

More Telugu News