: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. స్కోరు 27/1
ఆస్ట్రేలియాతో పూణేలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మురళీ విజయ్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజెల్ ఉడ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్ కు అవతల వెళుతున్న గుడ్ లెంగ్త్ బంతి... బ్యాట్ ను ముద్దాడుతూ కీపర్ చేతిలోకి వెళ్లడంతో మురళీ విజయ్ ఔట్ అయ్యాడు. మరో ఎండ్ లో రాహుల్ 17 పరుగులతో ఆడుతున్నాడు. రాహుల్ కు పుజారా జత కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు.