: ఐదు బంతులను మాత్రమే ఎదుర్కొని ఆలౌటైన ఆస్ట్రేలియా.. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం


పూణేలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 260 పరుగులకు ఆలౌట్ అయింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 256 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్... తొలి ఓవర్లో కేవలం ఐదు బంతులను మాత్రమే ఎదుర్కొని ఆలౌట్ అయింది. తొలి ఓవర్ ను అశ్విన్ వేయగా... రెండో బంతిని స్టార్క్ బౌండరీ దాటించాడు. ఆ తర్వాత ఐదో బంతికి డీప్ మిడ్ వికెట్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఒక్క పరుగు చేసిన హాజిల్ ఉడ్ నాటౌట్ గా మిగిలాడు. ఇండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు, అశ్విన్ 3, జడేజా 2, జయంత్ యాదవ్ ఒక్క వికెట్ తీశారు.

ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ ను ప్రారంభించింది. మురళీ విజయ్, లోకేష్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఐదు బంతులను ఎదుర్కొన్న రాహుల్ ఒక్క ఫోర్ బాదాడు. విజయ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు (1 ఓవర్) చేసింది. 

  • Loading...

More Telugu News