: శ్రీనివాస్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అమెరికన్ కంపెనీ
అమెరికాలోని కన్సాస్ లో ఓ తెల్లజాతి దురహంకారుడు జరిపిన కాల్పుల్లో తెలుగు వాడు శ్రీనివాస్ కూచిబొట్ల దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల ఆయన పని చేస్తున్న అమెరికన్ కంపెనీ గార్మిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శ్రీనివాస్ మృత దేహాన్ని భారత్ కు పంపించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కంపెనీ హెచ్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ లారీ మైనార్డ్ చెప్పారు. తెల్లజాతీయుడి కాల్పుల్లో మరో తెలుగు వ్యక్తి అలోక్ మాదసాని తీవ్రంగా గాయపడ్డాడు.