: తొలి రోజు ఆటలో నెలకొన్న రికార్డులివే!
పూణే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఆటగాళ్లు మూడు రికార్డులు నెలకొల్పారు. వాటి వివరాల్లోకి వెళ్తే...
* డేవిడ్ వార్నర్ ను బౌల్డ్ చేయడం ద్వారా ఉమేష్ యాదవ్ ఒకే ఆటగాడిని ఐదుసార్లు అవుట్ చేసిన రెండో బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. అంతే కాకుండా కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. కేవలం 32 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇది అతని కెరీర్ లో బెస్టు.. గతంలో విండీస్ పై 80 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. దానిని ఈ ఇన్నింగ్స్ లో అధిగమించాడు.
* ఆసియాలో పిన్నవయసులో అర్ధసెంచరీ సాధించిన ఆసీస్ ఆటగాడిగా ఆస్ట్రేలియా ఓపెనర్ రెన్ షా రికార్డు పుటలకెక్కాడు. 68 పరుగులు చేసిన రెన్ షా వయసు 20 ఏళ్ల 332 రోజులు. 1979లో కాన్పూర్ వేదికగా జరిగిన టెస్టులో రిక్ డార్లింగ్ 22 ఏళ్ల 156 రోజుల వయసులో ఉండగా అర్ధసెంచరీ సాధించాడు.
* టెస్టుల్లో 100 వికెట్లు తీసి 1000 పరుగులు చేసిన 63వ ఆటగాడిగా ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ రికార్డు పుటలకెక్కగా, ఈ ఫీట్ సాధించిన 14వ ఆస్ట్రేలియా క్రికెటర్ గా అతను నిలిచాడు. అలాగే చివరి ఆటగాడితో కలిసి 51 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఆటగాడిగా... చివరి వికెట్ కు అత్యధిక పరుగులు జోడించిన మూడో జోడీగా స్టార్క్, హాజెల్ వుడ్ నిలిచారు.