: రేపు అమ్మ పుట్టిన రోజు బాగా చెయ్యండి: శశికళ ఆదేశం


రేపు దివంగత జయలలిత జన్మదినం!
పురచ్చితలైవి జయ మరణం తర్వాత వస్తున్న ఆమె తొలి జయంతిని ఘనంగా నిర్వహించాలని శశికళ జైలు నుంచి పార్టీ కేడర్ కు లేఖ రాసి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జయలలిత జయంతిని ధూంధాంగా నిర్వహించాలని, సామూహిక అన్నదానాలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఫోటోలను ప్రజల దర్శనార్థం ఉంచి, అమ్మకు ఘన నివాళులర్పించాలని పార్టీ కార్యకర్తలకు హితబోధ చేశారు.

అమ్మ ఎపుడూ సవాళ్లకు తలొగ్గలేదనీ, చాలా ధైర్యంతో ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. అదే ధైర్యాన్ని, స్ఫూర్తిని తమకు అందించారని ఆమె తెలిపారు. 1987లో ఎమ్జీఆర్ మరణానంతరం పార్టీని పునర్నిర్మించిన ఘనత ఆమెదేనని తెలిపారు. ప్రేమ, దయ, కష్టించేతత్వంతో ఆమె అందరి మనసుల్లో కొలువయ్యారని ఆమె చెప్పారు. 33 ఏళ్లపాటు ఆమెతో కలిసి ఉన్న తాను జైలులో ఒంటరిగా ఉన్నానని పేర్కొన్నారు. ఆమె ప్రతి పుట్టినరోజు ఘనంగా జరుపుకునేవారమని, ఈ సారి ఆమె మన మధ్య లేకపోవడం విచారంగా ఉందని ఆమె చెప్పారు. 'గతేడాది ఆమె ఉన్నారు... ఈ ఏడాది ఆమె జ్ఞాపకాలే మిగిలాయి' అని ఆమె ఆ లేఖలో తెలిపారు.  

  • Loading...

More Telugu News