: భూమిని పోలిన ఏడు గ్రహాలను కనుగొన్న శాస్త్రవేత్తలు
ఖగోళ శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని కనుగొన్నారు. మనకు సుదూరంగా ఉన్న మరో సౌరకుటుంబంలో భూమిని పోలిన ఏడు గ్రహాలను గుర్తించారు. మనకు 39 కాంతి సంవత్సరాల దూరంలో ట్రాపిస్ట్-1 నక్షత్రం చుట్టూ ఆ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మన భూగ్రహం కాకుండా... విశ్వంలోని ఏ ఇతర గ్రహం మీదైనా ఏలియన్లు ఉన్నారా? అనే విషయంపై అధ్యయనం చేయడానికి ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ గ్రహాల్లో మూడు గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయని శాస్తవేత్తలు గుర్తించారు. ఈ గ్రహాలపై నీటి ఛాయలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు, ఇవి త్రాపిస్ట్ నక్షత్రానికి దగ్గరగా ఉండటంతో జీవానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. కొత్త సౌరకుటుంబం కొద్దిపాటి తేడాలతో మన సౌరకుటుంబం మాదిరే ఉంటుందని చెప్పారు. బెల్జియంలోని యూనివర్శిటీ ఆఫ్ లీగ్ కు సంబంధించిన ఎక్సోప్లానెట్ పరిశోధకుడు మైఖేల్ గిల్లాన్ తన నివేదికలో ఈ గ్రహాలకు సంబంధించిన అంశాన్ని వెల్లడించారు.