: విజువల్లీ చాలెంజ్డ్ అమ్మాయికి తన చిత్రంలో పాట పాడే అవకాశం ఇచ్చిన హీరో!
విజువల్లీ చాలెంజ్డ్ (అంధత్వం) అమ్మాయికి తన తర్వాతి చిత్రంలో ఓ పాట పాడే అవకాశాన్ని ఇచ్చి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ సహృదయాన్ని చాటుకున్నాడు. తాను ప్రధాన పాత్రలో నటించనున్న ‘అడంగతే’ అనే సినిమాలో జ్యోతి సింగర్ గా డెబ్యూ ఇవ్వనుందని ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపాడు. ఈ సందర్భంగా తాను జ్యోతితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. జ్యోతి ఇప్పటికే పలు వేదికలపై పాడి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమెకు ప్రకాశ్ అవకాశం ఇవ్వడంతో ఆయనను అభిమానులు అభినందిస్తున్నారు.