: జైలులో మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా దరఖాస్తు చేసుకున్న శశికళ


అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శశికళ వారం రోజుల క్రితం జైలుకెళ్లిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆమెను అన్నాడీఎంకే పార్టీ కర్ణాటక యూనిట్‌ సెక్రటరీ పుహళేంది జైలులో క‌లిశారు. అనంతరం పుహ‌ళేంది మాట్లాడుతూ... జైలులో ఉన్న శ‌శిక‌ళ బలహీనంగా కన్పిస్తున్నా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఆమె బీపీ, షుగర్ స్థాయులు సాధారణంగానే ఉన్నాయని అన్నారు. చిన్న‌మ్మ‌ ఇప్పుడిప్పుడే జైలు జీవితానికి అలవాటు పడుతున్నారని పేర్కొన్నారు. శ‌శిక‌ళ త‌న‌కు బాత్‌రూం ఉన్న గది, మంచం, పరుపు, టేబుల్‌ ఫ్యాన్‌ వంటి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నార‌ని అన్నారు. అందుకు జైలు అధికారులు అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.




  • Loading...

More Telugu News