: ఢిల్లీ యూనివర్సిటీలో మరో కలకలం... ఆజాద్ కశ్మీర్ నినాదాల వీడియో వైరల్
ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంజాస్ కాలేజ్ లో నిన్న ఏబీవీపీ, ఏఐఎస్ఏ విద్యార్థి సంఘాల మధ్య వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకొని పలువురికి గాయాలైన నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా మోహరించారు. కాగా, ఈ రోజు రాంజాస్ కాలేజీలో నిన్న విద్యార్థులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో కొందరు విద్యార్థులు ఆజాద్ కశ్మీర్ నినాదాలు చేశారన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఫ్రీడమ్ ఫర్ స్టూడెంట్స్, ఫ్రీడమ్ ఫర్ కశ్మీర్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
Just received this video clip of ultra left protest inside Ramjas College. Slogan is: 'Hum Kya Chahte Azadi, Kashmir Maange Azadi'. Tragic. pic.twitter.com/9KF0eDqNxX
— Aditya Raj Kaul (@AdityaRajKaul) 22 February 2017