: రైతుల సమక్షంలో మంత్రి హరీశ్‌రావుకి ఫోను చేసిన రేవంత్‌రెడ్డి
తమ సమస్యలపై నిరసన తెలుపుతూ తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్‌లోని ఎనుమాముల నుంచి కలెక్టరేట్ వరకు రైతులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో రేవంత్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం రైతుల సమక్షంలో మంత్రి హరీశ్‌రావుకి ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను వివరించారు. మిర్చి, కంది పంటలకు మద్దతు ధర కల్పించాలని ఆయన కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన హరీశ్‌రావ్.. ఆయా పంటలను సర్కారు తరపున కొనుగోలు చేస్తామని చెప్పారు.