: లిఫ్ట్ ఇస్తామంటూ కారు ఎక్కించుకున్నారు.. గ్యాంగ్ రేప్ చేశారు!


ఎన్ని చట్టాలు చేసినా, ఎంతో మందికి శిక్షలు పడుతున్నా... కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీ గురించయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతోంది. తాజాగా, ఢిల్లీలో మరో అరాచక ఘటన జరిగింది. లిఫ్ట్ ఇస్తామంటూ కారులో ఎక్కించుకున్న ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు.

ఈ దారుణం ఢిల్లీ శివార్లలోని తిమార్ పూర్ గ్రామం వద్ద జరిగింది. లిఫ్ట్ ఇస్తామంటూ నలుగురు యువకులు ఓ మహిళను కారులోకి ఎక్కించుకున్నారు. ఈ నలుగురూ ఆమెకు తెలిసిన వారే. ఆ తర్వాత ఢిల్లీ శివార్లలోని రోహిణి, ఉత్తర ఢిల్లీ ప్రాంతాల్లో కారును తిప్పుతూ, కారులోనే ఆమెపై అత్యాచారం జరిపారు. ఈ ఘటనతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం స్పృహలోకి వచ్చిన బాధిత మహిళ... జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News