: ఉత్కంఠభరిత పోరు మొదలైంది... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా


అత్యంత ఉత్కంఠ భరిత భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభమైంది. పూణేలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ కు మొగ్గు చూపాడు. భారత్ పిచ్ లపై స్పిన్నర్లను ఎదుర్కోవడం అత్యంత కష్టసాధ్యమైన పని కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్ లో పిచ్ పూర్తి స్థాయిలో స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో... ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

తుది జట్టు వివరాలు...
భారత్: మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానే, సాహా, అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, రెన్షా, స్టీవెన్ స్మిత్, షాన్ మార్ష్, హ్యాండ్స్ కూంబ్, మిచెల్ మార్ష్, వేడ్, ఓకీఫే, లియాన్, స్టార్క్, హాజిల్ వుడ్. 

  • Loading...

More Telugu News