: రూ.55 కోట్లకుపైగా విలువ చేసే బినామీ ఆస్తులను అటాచ్ చేసిన ఐటీ
పెద్దమొత్తంలో బినామీ లావాదేవీలను గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ రూ.55 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. నోట్ల రద్దు తర్వాత పెద్ద ఎత్తున బినామీ లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన ఐటీశాఖ ఇప్పటి వరకు 235 కేసులు నమోదు చేసింది. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ లావాదేవీల చట్టం కింద వీటిలో 140 కేసుల్లో ఆస్తుల స్వాధీనానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
బినామీ లావాదేవీల ద్వారా 200 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఐటీ అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము, వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, నగలు వంటివి కూడా అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయని అధికారులు వివరించారు. బినామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ అమెండమెంట్ యాక్ట్ 2016 ప్రకారం బినామా లావాదేవీలు నిర్వహించడం శిక్షించదగిన నేరం. దోషులుగా తేలిన వారికి ఏడాదికి తక్కువ కాకుండా కఠిన కారాగార శిక్ష అమలు చేస్తారు. శిక్షను ఏడేళ్ల వరకు కూడా పెంచే అవకాశం ఉంది. మార్కెట్ రేటు ప్రకారం ఆస్తిలో 25 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.