: స్పైస్‌జెట్ నాలుగు రోజుల ఆఫర్.. అతి తక్కువ ధరకే విమాన టికెట్!
ఇటీవలే ఎయిర్ ఆసియా, జెట్‌ఎయిర్‌వేస్ సంస్థలు దేశీయ విమానాల్లో అతి తక్కువ ధరలకే విమాన టికెట్లు అందిస్తామని ప్రకటనలు చేసి ప్రయాణికులను ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా స్పైస్‌జెట్ కూడా ఈ రోజు అటువంటి ప్రకటనే చేసింది. ‘లక్కీ 7సేల్’ పేరుతో ఓ సరికొత్త పథకం ద్వారా అన్ని ఛార్జీలను కలిపి ఒక్కో టికెట్‌ను కేవలం రూ.777లకే ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు టికెట్ల అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. టికెట్ బుక్ చేసుకున్న వారు మార్చి 9 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఏ రోజయినా ప్రయాణం చేయవచ్చని చెప్పింది. ఈ పథకం ప్రయాణికులకు ఒకవైపు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తుంది. సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయని పేర్కొంది.