: 22 ఏళ్ల క్రితం ఆయన నాకు ఇదే రోజు ప్రపోజ్ చేశారు: సినీనటి ఖుష్బూ
సినీ నటి ఖుష్బూ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 22 ఏళ్ల క్రితం తీసిన ఓ ఫొటోను ఆమె పోస్ట్ చేసి ఫిబ్రవరి 22న తాను ‘మురైమమన్’ సినిమా షూటింగ్‌లో ఉన్నానని, ఆ సమయంలోనే తన భర్త సుందర్ తనకు ప్రపోజ్ చేశారని చెప్పారు. తమ ఇద్దరి ప్రయాణం అలా మొదలైందని చెప్పారు. 2001లో సి. సుందర్‌తో ఆమె పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వీరికి అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్బూ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు.
This pic was tkn 22yrs ago on 22nd Feb while shooting 4 #MuraiMaman..it was on dis eve he proposed 2 me n journey of togetherness began ❤❤❤❤ pic.twitter.com/FBuGL0F0Dz
— khushbusundar (@khushsundar) 22 February 2017