: కమలహాసన్ అభిమానుల అరెస్ట్.. రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని కమల్‌ ఆగ్రహం


తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు క్రీడ కోసం గత నెల చెన్నయ్ మెరీనా బీచ్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున‌ ఆందోళన నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే, అందులో పాల్గొన్నార‌ని ఆరోపిస్తూ ప్రముఖ సినీ న‌టుడు క‌మ‌లహాస‌న్ అభిమానులైన‌ సుధాగర్‌ అనే వ్యక్తిని, 'కమల్‌హాసన్‌ రసిగరల్‌ నర్పని ఇయక్కం' సంఘానికి చెందిన కొంతమంది సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల చ‌ర్య‌పై కమలహాస‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను ఇక ట్వీట్లు తగ్గించి, మౌనంగా ఉండాలనుకుంటున్నానని, ప్రజల న్యాయం దేశాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నాన‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

నిన్న సుధాగర్‌ని, ఇయక్కం ఆర్గనైజేషన్‌కు చెందిన కొంతమందిని జల్లికట్టు ఆందోళనకారులుగా చెబుతూ పోలీసులు అరెస్టు చేశారని కమల్ చెప్పారు. దీనివల్ల త‌మ‌ ప్రతిష్ఠ పెరుగుతుందని, త‌మ‌పై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారన్న విషయం బయటపడుతుందని ఆయ‌న అన్నారు. ఇప్పుడు మా 'ఇయక్కం' సభ్యులు ఇంకా సహనం, హుందాతనంతో ఉండాలని ఆయ‌న సూచించారు.

అరెస్టుల‌కు గుర‌యిన‌ప్ప‌టికీ త‌న అభిమానులు ఎక్కడా హద్దులు దాటకుండా ఉండాల‌ని, అలాగే త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేయాల‌ని ఆయ‌న సూచించారు. సిద్ధాంతాలను వదులుకోవాల్సిన పనిలేదని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడటమే త‌మ‌ పని అని, ప్రతిఫలం లేని ఈ బాధ్యతను ఎప్పటికీ కొనసాగిస్తామ‌ని, పాలకులు వస్తారు.. పోతారు... కానీ దేశం శాశ్వతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News