: తొలి టెస్టుకు బౌన్సీ పిచ్ తయారు చేసిన క్యూరేటర్... అశ్విన్, జడేజాలదే భారం


ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. పూణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు రెండు జట్లు తీవ్ర ప్రయత్నాల్లో ఉండగా, క్యూరేటర్ బౌన్సీ పిచ్ ను తయారు చేశాడు. దీంతో పిచ్ పై బంతి బాగా బౌన్స్ అవుతుందని చెబుతున్నాడు. ప్రారంభంలో పేసర్లకు అనుకూలించే ఈ పిచ్ ఆడేకొద్దీ బౌన్సీగా మారుతుందని, దీంతో స్పిన్నర్లు రాణించే అవకాశం ఉందని క్యూరేటర్ చెబుతున్నాడు.

అయితే పేస్ బౌలర్లకు బౌన్సీ పిచ్ అయితే, బ్యాట్స్ మన్ కు అది అనుకూలంగా మారుతుంది. దీంతో పేసర్లు బంతులను స్వింగ్ చేయడం ద్వారా ఆకట్టుకునే అవకాశం ఉంది. స్పిన్నర్లు బంతిని ఎంత ఎక్కువ స్పిన్ చేస్తే బంతి అంతగా తిరిగే అవకాశం ఉందని, ఈ క్రమంలో బౌన్స్ అవుతున్న బంతిని చూసిన బ్యాట్స్ మన్ అత్యుత్సాహంతో ఆడే ప్రయత్నంలో బుట్టలో పడతాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పిచ్ పై ఆసీస్ స్పిన్నర్లు చూపే ప్రభావం కంటే టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు రాణించే అవకాశాలు ఎక్కువని వారు పేర్కొంటున్నారు. దీంతో తొలి టెస్టులో వీరిద్దరి రాణింపుపైనే జట్టు విజయావకాశాలున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News