: హైదరాబాద్‌లో న‌కిలీ హిజ్రా.. అస‌లైన హిజ్రాల కంట‌ప‌డి, చెప్పు దెబ్బ‌లు తిన్నాడు!


శ‌రీర‌భాగాలు అన్నీ బాగానే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ప‌ని చేయ‌డం అంటే ఎంతో బ‌ద్ధ‌కం ఆ యువ‌కుడికి. ఈ క్రమంలో హైద‌రాబాద్‌లో హిజ్రాలు షాపుల వ‌ద్ద‌కు వ‌చ్చి డ‌బ్బులు తీసుకుంటున్న విష‌యాన్ని గ‌మ‌నించాడు. ఆ ప‌నే బాగుంద‌ని అనుకున్నాడు. తాను హిజ్రా కాక‌పోయినా చీర క‌ట్టుకొని ఆ వేషం వేసి న‌గ‌రంలోని దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో తిరుగుతూ షాపుల్లో అడుక్కుంటున్నాడు. ఆ స‌మ‌యంలోనే అటువైపుగా వ‌చ్చిన  అసలైన హిజ్రాలకు అతను పట్టుబడ్డాడు. ఆగ్ర‌హం తెచ్చుకున్న హిజ్రాలు ఈ నకిలీ హిజ్రాను ప‌ట్టుకొని చెప్పులతో కొట్టారు. అతడి ఒంటిపై ఉన్న దుస్తులను చింపేశారు. మ‌రోసారి ఇలాంటి పని చేయనని ఆ యువ‌కుడు చెప్పినా వ‌ద‌ల‌లేదు. ఓ కానిస్టేబుల్ జోక్యం చేసుకోవ‌డంతో వారి బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు.

  • Loading...

More Telugu News