: పాయింట్లు పోయాక పట్టుదల..!


ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తాజా ఐపీఎల్ సీజన్లో పెద్దగా సాధించాల్సిందేమీ లేదు. ఇప్పటికే ఆ జట్టు నాకౌట్ దశ చేరే అవకాశాలను కోల్పోయింది. 9 మ్యాచ్ లాడి రెండు విజయాలు 7 పరాజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఇప్పుడా జట్టు ఇతర జట్లకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఎందుకంటే, డెవిల్స్ కు ఓడినా గెలిచినా ఒక్కటే.

దీంతో, ఒత్తిడి లేకుండా బరిలో దిగడం ద్వారా మెరుగైన ఆటతీరుతో మిగతా జట్లను కంగుతినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో, కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులే చేయగలిగారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సిన బాధ్యత ఢిల్లీ బ్యాట్స్ మెన్ దే.

  • Loading...

More Telugu News