: పాత నీరు పోతే.. కొత్తనీరుతో పార్టీ బలోపేతం: సీఎం
పాత నీరు పోతే కొత్త నీరుతో పార్టీ బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవలి కాలంలో పార్టీని వీడి వెళుతున్న వ్యవహారంపై ముఖ్యమంత్రి ఇలా స్పందించారు. నాయకుల వల్ల పార్టీ బతకదని తేల్చి చెప్పారు. ఒకవేళ అలా అని ఎవరైనా అనుకుంటే అది వారి పోరపాటన్నారు. 1977లో కాంగ్రెస్ నుంచి 150 మంది ఎమ్మెల్యేలు వెళ్లినా తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలిచిన విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉదాహరణగా చెప్పారు.