: ప్రొ.కోదండరాం అరెస్టుపై పోలీసు కమీషనర్ ను ఆశ్రయించిన ఆయన సతీమణి
హైదరాబాద్ నగరంలో నిరుద్యోగ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, రాజ్యాంగం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకునే హక్కును కల్పించిందని తెలుపుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పిన కోదండరాంను, ఈ రోజు తెల్లవారు జామున పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోదండరాం సతీమణి నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డిని ఆశ్రయించారు. తన భర్త అరెస్టుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. కాగా, కోదండరాం అరెస్టుపై మానవహక్కుల సంఘానికి టీజేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. కోదండరాంను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.