: యువతకు ఉపాధి కల్పన ఏది?: సీఎం చంద్రబాబుకి జగన్ బహిరంగ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 33 నెలలు అయిందని, అయినప్పటికీ యువతకు ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చలేదని ఆయన అందులో పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారని, వారికి చెల్లించాల్సిన భృతి కోసం 2017-18లో బడ్జెట్ కేటాయించాలని అన్నారు. లేదంటే వారి సమస్యలపై తాము పోరాడతామని అన్నారు. తమ తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలను మరిచిపోయారని ఆయన విమర్శించారు.