: కేసీఆర్ పతనం మొదలైంది.. పుట్టగతులు కూడా ఉండవ్: రేవంత్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయనకు పుట్టగతులు కూడా ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ ర్యాలీకి వెళుతున్న విద్యార్థులను అరెస్ట్ చేయడం అత్యంత దురదృష్టకరమైన చర్య అని అన్నారు. నిర్బంధాలతో నిరుద్యోగులను అణచి వేయాలని ప్రయత్నిస్తే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. నిరంకుశ, నియంతృత్వ విధానాలతో పాలించిన వారెవరూ చరిత్రలో మిగల్లేదనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News