: హైదరాబాద్‌కు భారీగా చేరుకున్న అదనపు పోలీస్ బలగాలు


హైద‌రాబాద్‌లోని సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వ‌ర‌కు శాంతియుత‌ ర్యాలీకి టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం పిలుపునిచ్చిన నేప‌థ్యంలో ఆ ర్యాలీకి అనుమ‌తి లేద‌ని, ఎవ‌రూ హైద‌రాబాద్‌కు రావ‌ద్దని డీజీపీ అనురాగ్ శ‌ర్మ సూచించారు. రేపు అసాంఘిక శ‌క్తులు చొర‌బ‌డే అవకాశం ఉందని ఆయ‌న చెప్పారు. జేఏసీ నిరుద్యోగ ర్యాలీకి అనుమ‌తి లేదని అన్నారు. ర్యాలీలో విధ్వంసం జ‌రిగితే ఎవ‌రిది బాధ్య‌త అని అన్నారు. ర్యాలీలో పాల్గొంటే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

మ‌రోవైపు హైదరాబాద్‌కు అదనపు పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ప్ర‌ధానంగా సుందరయ్య విజ్ఞానకేంద్రం, ఇందిరాపార్కు, ఓయూ పరిసరాల దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. అరెస్టుల ప‌ర్వం ఇప్ప‌టికే మొద‌లైంది. నిరసన కార్యక్రమాల్లో హింస జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News