: ఆలేరు వద్ద గరుడ బస్సులో చెలరేగిన మంటలు!


వరంగల్-1 డిపోకు చెందిన గరుడ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ఆలేరు వద్ద జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అయితే, డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో పొగలు వ్యాపించడంతో వెంటనే స్పందించిన డ్రైవర్, బస్సును పక్కకు తీసి ఆపివేశాడు. దీంతో, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, ఈ సంఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైందని, బస్సులో ఉన్న మొత్తం 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని సంబంధిత అధికారుల సమాచారం.

  • Loading...

More Telugu News