: రోజా, నోరు అదుపులో పెట్టుకో!: యామినీ బాల
టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రభుత్వ విప్ యామినీ బాల మండిపడ్డారు. రోజా నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆమె సూచించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు మహిళలంతా పోరాటం చేయాలన్న రోజా వ్యాఖ్యలపై యామిని ఫైర్ అయ్యారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న రోజాను మహిళలే బహిష్కరించే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ఆమె సొంత నియోజకవర్గ ప్రజలే రోజాను ఛీకొడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా రోజా తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు.