: ఈ స్పెషల్ కళ్లద్దాలతో వీడియో రికార్డు చేసుకోవచ్చు!


ఫొటో షేరింగ్ సర్వీస్ ఫీచర్ ఉన్న స్పెషల్ కళ్లద్దాలను ‘స్నాప్ చాట్’ అందుబాటులోకి తీసుకురానుంది. అమెరికా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్పెక్టకిల్స్ ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్నాయి. అమెరికా నెటిజన్లు ఆన్ లైన్ లో స్నాప్ చాట్ స్పెక్టకిల్స్ బుక్ చేసుకుని వినియోగించుకోవచ్చు.ఈ కళ్లద్దాల వాడకంతో వీడియో రికార్డింగ్, ఫొటో షేరింగ్ చేసుకోవచ్చు. వచ్చే నెల 2వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి రానున్న కళ్లద్దాల ధర 129.99 అమెరికన్ డాలర్లు. కళ్లద్దాలను కేబుల్ వైరు ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News