: అభిమాని పెళ్లికి సికింద్రాబాద్ వస్తానంటున్న తాప్సీ!
అందాల నాయిక తాప్సీ తన అభిమాని వివాహానికి హాజరుకానుండడం ఆసక్తి కలిగిస్తోంది. తన తొలిచిత్రం 'ఝమ్మందినాదం', ఆ తర్వాత 'మిస్టర్ పర్ఫెక్ట్' మినహా చెప్పుకోదగ్గ విజయాలు లేని తాప్సీ...బాలీవుడ్ లో మాత్రం సత్తాచాటింది. 'బేబీ', 'పింక్', తాజాగా 'ఘాజీ' వంటి సినిమాలు ఆమెను బాలీవుల్ లో విజయవంతంమైన, ప్రతిభావంతమైన నటిగా నిలిపాయి. ఇదిలా ఉంచితే, ఝమ్మంది నాదం సినిమా నుంచి తనతో మెయిల్స్ ద్వారా టచ్ లో ఉన్న ఓ అభిమాని వివాహానికి హాజరుకానుందని తెలుస్తోంది. సికింద్రాబాద్ లో జరగనున్న ఈ పెళ్లిలో తాప్సీ ప్రధాన ఆకర్షణ కానుంది. కాగా, ఈ వివాహానికి హాజరయ్యేందుకు తాప్సి ఎంతో ఎదురు చూస్తోంది. అయితే ఈ అభిమాని ఎవరు? అన్నది మాత్రం సీక్రెట్ గా వుంచడం విశేషం.