: జాతీయ సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఓయూ స్టూడెంట్స్


జాతీయ సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విధ్యార్థులు ధ్వంసం చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఓయూకి చెందిన కొందరు విద్యార్థులు 'శరణం గచ్ఛామి' సినిమా విడుదల ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ సినిమాను రూపొందించారంటూ ఈ సినిమాకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విడుదలకు సెన్సార్ బోర్డు అంగీకరించలేదు.

దీంతో ఈ సినిమా దర్శక, నిర్మాతలు న్యాయం చేయాలంటూ జాతీయ సెన్సార్ బోర్డుకు వెళ్లారు. అక్కడ సినిమా చూసిన వారు రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. దీంతో ఈ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు ధ్వంసం చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

  • Loading...

More Telugu News