: చంద్రబాబు రావణాసురుడు.. జగనన్న మహిళా పక్షపాతి: రోజా
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని... మహిళలకు రక్షణ కరవైందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు రావణాసురుడి పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఈ రావణాసురుడి పాలనను అంతం చేయడానికి అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల పోరాటానికి వైసీపీ అధినేత జగనన్న అండగా ఉంటారని చెప్పారు. మహిళలకు ఐదు ఎంపీ సీట్లు ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్ అని ప్రశంసించారు. జగనన్న మహిళా పక్షపాతైతే.. చంద్రబాబు రావణాసురుడు అని ఆమె విమర్శించారు. ఓ మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చిన గొప్ప నేత వైయస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. చంద్రబాబు రాక్షస పాలనపై పోరాటం చేయడానికి మహిళలంతా కలసి రావాలని అన్నారు. అమరావతిలో జరిగిన మహిళా సదస్సును టీడీపీ మహానాడు కార్యక్రమంలా చంద్రబాబు మార్చేశారని మండిపడ్డారు.