: పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన సెలబ్రిటీలు...దూరంగా ఉన్న బాలీవుడ్ తారలు


బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు క్యూకట్టారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు బాలీవుడ్ నటుల నుంచి ఊహించిన స్పందన మాత్రం లభించడం లేదు. షూటింగ్ లతో బిజీగా ఉన్న పెద్ద హీరోలెవరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేదు. మరోవైపు ముంబై వాసులు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బృహన్ ముంబై కార్పొరేషన్ లో పాగా వేయాలని బీజేపీ, ఎన్సీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, బృహన్ ముంబై కార్పొరేషన్ లో చిరకాలంగా ఉన్న తన మెజారిటీని నిలుపుకుని, సత్తాచాటాలని శివసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి ఎన్నికల్లో బృహన్ ముంబై కార్పొరేషన్ పై ఎవరి పెత్తనమో తేలిపోనుంది. 

  • Loading...

More Telugu News