: తిరుమలలో రేపు టీఆర్ఎస్ నేత వివాహం.. హాజరు కానున్న కేసీఆర్ దంపతులు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో రేపు టీఆర్ఎస్ నేత వివాహం ఘనంగా జరగనుంది. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి బుధవారం స్వామివారి సన్నిధానంలోని పుష్పగరి మఠంలో వివాహం చేసుకోబోతున్నారు. నెక్కొండ మండలం నాగారానికి చెందిన వధువు మెళ్లో మూడుముళ్లు వేయబోతున్నారు. సుదర్శన్‌రెడ్డి వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఎంపీ కవిత, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.