: మార్చి 14న జనసేన వెబ్ సైట్ ను ప్రారంభిస్తాం: పవన్ కల్యాణ్
మార్చి14న జనసేన పార్టీ వెబ్ సైట్ ను ప్రారంభిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహ సభలో పవన్ మాట్లాడుతూ, 2019 మ్యానిఫెస్టో తయారీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదని, దీని పేరుతో అర్హత లేని వారు రాజకీయాల్లోకి రావడాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నారు. ఇచ్చిన హామీలను నేతలు ఎందుకు నెరవేర్చడం లేదో చెప్పాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ మరోమారు ప్రశ్నించారు.