: హైకోర్టులో ప్రొ.కోదండరాం పిటిషన్.. రేపు విచారిస్తామన్న న్యాయస్థానం
తెలంగాణలోని నిరుద్యోగ సమస్యను, ప్రభుత్వ అలసత్వాన్నితెలియజేస్తూ ఈ నెల 22న తలపెట్టిన 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వకపోవడంపై టీజేఏసీ హైకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. తాము నగరంలో శాంతియుతంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపడతామని పోలీసులకి హామీ ఇచ్చామని, అయినప్పటికీ పోలీసులు అందుకు అనుమతి ఇవ్వడం లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది.