: పవన్ తో ఉండవల్లి, పెనుమాక రైతుల భేటీ
ప్రముఖ సినీనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి హాయ్ ల్యాండ్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన చేనేత గర్జనసభకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీజియన్ లో ఉన్న ఉండవల్లి, పెనుమాక ప్రాంత రైతులు పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫ్లాట్ల కేటాయింపు, పరిహారం విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని చెప్పామన్నారు. సర్వం ప్రభుత్వానికి అప్పగించి పూర్తిగా కష్టాల్లో మునిగిపోయామని, తమను ఆదుకోవాలని ఆయను కోరేందుకు వచ్చామని చెప్పారు. వారి సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ నినాదలతో పరిసరాలు హోరెత్తాయి.