: ధోనీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా?


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు, మంచి ఫాంలో ఉన్నప్పుడు ఏ ఆటగాడినైనా అంతా ఆకాశానికెత్తుతారు, ఆ రెండూ పోతే అంతవరకు అనుభవించినవన్నీ దూరమవుతాయని ధోనీ కెరీర్ నిరూపిస్తోంది. టీమిండియా కెప్టెన్ గా విజయాల బాటపట్టిన ధోనీ పట్టిందల్లా బంగారమే.. 'కెప్టెన్ కూల్' అంటూ ఆయన గురించి ప్రస్తావించేటప్పుడు ఎన్నో టైటిల్స్ వాడేవారు.

తాజాగా పూణే జట్టు ధోనీ నుంచి కెప్టెన్సీని లాక్కుని, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు అప్పగించింది. ఈ సందర్భంగా జట్టు యాజమాన్యం మాట్లాడుతూ, ధోనీ అద్భుతమైన ఆటగాడని పేర్కొంది. కీలక సమయాల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకునేవాడని, ఎలాంటి పరిస్థితులనైనా అనుకూలంగా మలచుకునేవాడని తెలిపింది. అయితే, జట్టు కెప్టెన్ విషయంలో తమ అంచనాలు చెప్పేసరికి తమతో ఏకీభవించి స్మిత్ కు కెప్టెన్సీని బదలాయించాడని పేర్కొంటూ కవరింగ్ ఇచ్చారు. గతంలో టీమిండియా కెప్టెన్ గా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ధోనీ తిరుగులేని ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News