: హిట్ కొట్టిన రానా... కలెక్షన్లతో దూసుకుపోతున్న 'ఘాజీ'.. రోజురోజుకూ పెరుగుతున్న వసూళ్లు


జలాంతర్గామి కథాంశంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఘాజీ' సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. కలెక్షన్లతో దూసుకుపోతోంది. వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. అన్ని భాషల్లో కలిపి ఆదివారం నాటికి రూ. 15.75 కోట్ల వసూళ్లు వచ్చాయని ఆయన చెప్పారు. శుక్రవారం రూ. 4.25 కోట్లు, శనివారం రూ. 5.25 కోట్లు, ఆదివారం రూ. 6.25 కోట్లు కలెక్ట్ అయ్యాయని తెలిపారు. హిందీ వర్షన్ లోనే ఆదివారం నాటికి రూ. 6.70 కోట్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ చెప్పారు. అమెరికాలో శనివారం నాటికి రూ. 2.04 కోట్లను సినిమా రాబట్టిందని తెలిపారు. యూఎస్ మార్కెట్ లో శుక్రవారానికి, శనివారానికి ఏకంగా 73.46 శాతం పెరుగుదల నమోదయిందని చెప్పారు.

1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21కు, పాకిస్థానీ జలాంతర్గామి ఘాజీకి మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. దగ్గుబాటి రానా, తాప్పి తదితరులు ఈ చిత్రంలో నటించారు. దర్శకుడు సంకల్ప్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.      


  • Loading...

More Telugu News