: రెండు రోజులు ఇంట్లోనే ఒంటరిగా గడిపిన నాగార్జున.. ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు!


తన తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నాగార్జున చివరకు తీవ్ర నిరాశకు గురయ్యారట. సినిమాకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నా... కమర్షియల్ గా మాత్రం సినిమా హిట్ కాలేకపోయింది. ఈ సినిమా కూడా 'అన్నమయ్య' అంతటి ఘన విజయం సాధిస్తుందని నాగ్ ఆశలు పెట్టుకున్నారట. కానీ, కలెక్షన్ల పరంగా ఈ సినిమా హిట్ కాకపోవడంతో... నాగ్ బాధలో మునిగిపోయారు. రెండు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు కూడా రాలేదట. అంతేకాదు, కనీసం ఫోన్ కాల్స్ ను కూడా అటెండ్ చేయలేదట. అయితే, ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోవడానికి కారణం... సరైన సమయంలో విడుదల చేయకపోవడమేనని సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News